తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరమో, ఆంధ్రా పాలకుల దోపిడీకి గురై అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజల వెనకబాటుతనాన్ని గుర్తించి ప్రజలకు అండగా నిలిచి వీ6 న్యూస్ ఛానల్ చేసిన కృషిని తెలంగాణ ప్రజలు ఏనాటికి మరవలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కి అవినీతి, అక్రమాలే లక్ష్యంగా కొనసాగిన గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో మరో పదేళ్లు వెనక్కి వెళ్లిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు మంచి పాలన అందించేందుకు, అధికారుల్లో జవాబుదారీతనం కొనసాగేందుకు ఏర్పాటు చేసిన అనేక చట్టాలు ఆచరణలో, అమలులో చతికిల పడుతున్నాయి. ఇదే కోవలో సమాచార హక్కు చట్టం -2005 చేరింది. ఈ చట్టం పరిస్థితిపై మీడియా సైతం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆర్టీఐ యాక్ట్ అమలులో కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యంపై వీ6 వెలుగు సైతం ప్రత్యేక దృష్టి సారించాలని సవినయంగా కోరుతున్నాం.
- ఆడెం ఆంజనేయులు యాదవ్,
వనపర్తి జిల్లా
