
హైదరాబాద్: నేషనల్ ఇన్స్పైర్ అవార్డులకు రాష్ట్రం నుంచి మొత్తం 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు SCERT డెరెక్టర్ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రతి ఏటా ఇన్ స్పైర్ అవార్డ్స్ పోటీలను నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 14 నుంచి 16 వరకు ఢిల్లీలో నిర్వహించిన NLEPC పోటీలో రాష్ట్రం నుంచి 39 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. పలు అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను అసెస్ చేసిన DST అధికారులు... దేశవ్యాప్తంగా మొత్తం 60 మంది విద్యార్థులను ఎంపిక చేశారని చెప్పారు. అందులో రాష్ట్రం నుంచి 8 మంది సెలెక్ట్ అయ్యారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రపతి భవన్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థుల ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు.
ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు
1. తాటి భావన (మహబూబ్ నగర్)
2. ముస్త్యాల పూజశ్రీ (పెద్దపల్లి)
3. డోబ్లీ రుషికేశ్ (ఆదిలాబాద్)
4. సాయిల్ సాయి శ్రీవల్లి (మంచిర్యాల)
5. ఎడ్ల నాని (మహబూబాబాద్)
6. పొత్క దీపిక (జోగులాంబ గద్వాల్)
7. దాసరి హర్షిత (పెద్దపల్లి)
8. నక్క భవానీ ( మహబూబాబాద్)