జనగామ అర్బన్/ మహబూబాబాద్/ హనుమకొండ/ ములుగు, వెలుగు: కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనగామలో కలెక్టర్రిజ్వాన్బాషా షేక్ అడిషనల్కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్సింగ్లతో కలిసి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 47 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 131 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్అద్వైత్కుమార్సింగ్తెలిపారు. ఆయన కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లెనిన్ వత్సల్ టొప్పోతో కలిపి అర్జీలను స్వీకరించారు.
హనుమకొండలో 158 అప్లికేషన్లు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్వెంకట్ రెడ్డి తెలిపారు. ములుగులో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్దివాకర అడిషనల్కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి 51 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌వో అప్పయ్య ఆధ్వర్యంలో అనీమియా ముక్త తెలంగాణ పోస్టర్నుఆవిష్కరించారు.
కాలుష్యపు కోరల నుంచి కాపాడాలి
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి శ్రీ సత్యనారాయణ హాచరీ(కోళ్ల ఫాం) నుంచి వచ్చే వ్యర్థాల వల్ల సమీపంలోని చెరువులో నీరు కాలుష్యంతో నిండిపోతుందని, కాపాడాలని గ్రామస్తులు సోమవారం వరంగల్ కలెక్టర్ సత్య శారదకు వినతి అందించారు. తాగునీటికి ఉపయోగిస్తున్న చెరువు కాలుష్యం బారిన పడకుడా సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.
గిరిజన దర్బార్ వినతులను సత్వరమే పరిష్కరించాలి
ఏటూరునాగారం: ఏటీడీఏ మీటింగ్‌హాల్‌లో పీవో చిత్రామిశ్ర గిరిజన దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజనుల నుంచి వచ్చిన 30 వినతులను ఆమె స్వీకరించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో భీమ్ రావు, ఎస్వో రాజ్ కుమార్, ఎస్డీసీ డీటీ అనిల్, అధికారులు పాల్గొన్నారు.