పెబ్బేరు మండలంలో.. ఇసుక డంప్​లు సీజ్

పెబ్బేరు మండలంలో.. ఇసుక డంప్​లు సీజ్

పెబ్బేరు, వెలుగు : మండలంలోని రాంపూర్​ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్​లను అధికారులు సీజ్​ చేశారు. 624 ట్రాక్టర్ల ఇసుక డంప్​లను అధికారులు గుర్తించి సీజ్​ చేశారు. తహసీల్దార్​ లక్ష్మి, ఆర్ఐ రాఘవేంద్ర, మైనింగ్, కలెక్టరేట్​ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై సమాచారం ఇవ్వాలని తహసీల్దార్​ సూచించారు.