
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ OG(Orginal Gangstar). సుజీత్(Sujeeth) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానులకి భారీ అంచనాలున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చే నెల(సెప్టెంబర్2న) ఉండటంతో.. పవన్ మూవీస్ నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకు OG మూవీ టీం గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. OG మూవీ నుంచి సాలిడ్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
ఈ గ్లింప్స్కి మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని తెలుస్తుంది. ఈ గ్లింప్స్లో అర్జున్ దాస్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజు విక్రమ్ మూవీలో రోలెక్స్ పిలుపుతో ఓ రేంజ్లో పాపులర్ అయ్యాడు అర్జున్ దాస్. దీంతో అర్జున్ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఈ క్రేజీ యాక్టర్ వాయిస్ ఎలా ఉండబోతుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ను OG టీం త్వరలో ప్రకటించబోతుంది.
ఇక OG మూవీ విషయానికి వస్తే..సాహో మూవీతో మంచి బజ్ క్రీయేట్ చేసిన డైరెక్టర్ సుజిత్..ఇప్పుడు పవర్ స్టార్ తో OG మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్(Priyanka Mohan) నటిస్తుండగా..తమిళ నటుడు అర్జున్ దాస్(Arjun Das), శ్రియ రెడ్డి(Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) విలన్ గా నటిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ప్రొడ్యూసర్ ధానయ్య(Daanayya) నిర్మిస్తున్న ఈ సినిమాకు..లేటెస్ట్ టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు.