
దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా యాదవ ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గాజనమేన శ్యాంకుమార్ యాదవ్, ఉపాద్యక్షుడు చిట్టవేని వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో దహెగాంలో జరిగిన కార్యక్రమంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాసబోయిన బానేశ్ యాదవ్, ఉపాధ్యక్షునిగా జాగరి సత్తన్న, ప్రధాన కార్యదర్శిగా ఎగ్గె రమేశ్, కోశాధికారిగా చెన్నబోయిన చంద్రయ్య, సంయుక్త కార్యదర్శిగా తీగల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా గొట్ల తిరుపతిని ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టవేణి వెంకటేశ్, కార్యదర్శి అంగ మల్లయ్య, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు గంధం రాజకుమార్, చింతల రఘుప్రసాద్, బాషబోయిన వెంకన్న, ఎగ్గె చరణ్, చెన్నబోయిన మల్లేశ్, భూసం మల్లేశ్, ఒగ్గు పూజారులు, యాదవ కులస్తులు పాల్గొన్నారు.