మస్క్‌‌పై న్యాయపోరాటానికి సిద్ధమైన ట్విట్టర్

మస్క్‌‌పై  న్యాయపోరాటానికి సిద్ధమైన ట్విట్టర్

ట్విట్టర్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై దావా వేయాలని ట్విట్టర్ యోచిస్తోంది. దీనిపై మస్క్ రెస్పాండ్ అయ్యారు. Oh the irony lol అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దావా గురించి మాత్రం అతను ప్రస్తావించలేదు. ట్విట్టర్ తో ఎలాన్ మస్క్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ.. అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మస్క్ ప్రకటించారు. దీంతో అతనిపై న్యాయపోరాటానికి ట్విట్టర్ సిద్ధమౌతోంది. ‘రోసెన్ అండ్ కాట్జ్, ఎల్ఎల్‌పీ వాటెల్, లిప్టన్’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ట్విట్టర్ ను ఖచ్చితంగా కొనుగోలు చేయాలని, లేకపోతే పరిహారం చెల్లించాలని కోర్టును కోరనుంది. మస్క్ నిర్ణయంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టైలర్ వెల్లడించారు. 

ఒప్పందం రద్దుకు గల కారణాలను మస్క్ ప్రకటించారు. ఒప్పందంలో నియమాలు ఉల్లంఘించడం వల్ల ఈ డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఫేక్, స్పామ్ అకౌంట్ల సమాచారం ఇవ్వడంలో ట్విట్టర్ ఘోరంగా విఫలం చెందిందని అందుకే ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో సోషల్ మీడియాలో మస్క్ పలు పోస్టులు చేశారు. పోస్ట్ చేసిన ఇమేజ్ లోని మొదటి గ్రిడ్ లో నవ్వుతున్న ఫొటో పెట్టి పక్కనే వాళ్లు నేను ట్విట్టర్ కొనలేనని అన్నారు కామెంట్ చేశారు. సెకండ్ గ్రిడ్ లో ఇంకాస్త గట్టిగా నవ్వుతున్న ఇమేజ్ పక్కనే  తర్వాత బాట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కుదరన్నరు అని రాసుకొచ్చారు. థర్డ్ గ్రిడ్ లో ఇప్పుడు కోర్టుకెళ్లి నాతో బలవంతంగా ట్విట్టర్ కొనిపిస్తానంటున్నారన్నారు. ఇక ఫోర్త్ గ్రిడ్ లో మస్క్ పగలబడి నవ్వుతున్న ఫొటో పక్కన బోట్ సమాచారాన్ని కోర్టులో బహిర్గతంలో చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ట్విట్టర్ దావా వేసిన అనంతరం ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.