ఎల్ అండ్ టీ మెట్రో హైదరాబాద్​తో ఓజీకేర్ ఒప్పందం

ఎల్ అండ్ టీ మెట్రో హైదరాబాద్​తో  ఓజీకేర్ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు:  ముంబై కేంద్రంగా పనిచేసే  ఓజీకేర్ సిటీలోని పలు ప్రభుత్వ ఆస్తులను శుభ్రపరిచే (డిస్​ఇన్ఫెక్షన్​) కాంట్రాక్టులను దక్కించుకుంది. ఓజోన్​ వంటి అత్యాధునిక టెక్నాలజీలను వినియోగించడం ద్వారా మాల్స్, హోటల్స్, హాస్పిటల్స్​వంటి రద్దీ ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా చేస్తామని తెలిపింది.

 ఓజీకేర్ ఎల్ అండ్ టీ మెట్రో  హైదరాబాద్​తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో హైదరాబాద్ సర్వీస్ యార్డులో  మొబిజోన్​ను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల మెట్రో కార్స్​ను అత్యంత వేగంగా డిస్ఇన్ఫెక్షన్ చేయవచ్చు. ఈ టెక్నాలజీతో సమయం, డబ్బు ఆదా  అవుతాయి. ఈ టెక్నాలజీతో 10 నిమిషాల సమయంలోనే రైలును శానిటైజ్ చేయవచ్చు. ఇందుకోసం ఎలాంటి హానికారక రసాయనాలను వాడమని ఓజీకేర్​ తెలిపింది. జీఎంఆర్ ఎయిర్​పోర్ట్​ హైదరాబాద్​లోనూ శానిటైజ్ యూనిట్లను వాష్​రూమ్​లలో ఏర్పాట్లు చేయనుంది. దీనిద్వారా వేగంగా చెడు వాసనలను పోగొట్టడంతో పాటుగా వాష్ రూమ్​లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచవచ్చు. కేర్​ హాస్పిటల్స్,​ గచ్చిబౌలిలోని ఓక్ఉడ్ హోటల్స్​కు  సైతం ఇలాంటి సేవలను అందిస్తున్నామని కంపెనీ ఈ సందర్భంగా ప్రకటించింది.