'ఒకే ఒక జీవితం' ట్రైలర్‌ వచ్చేసింది

'ఒకే ఒక జీవితం' ట్రైలర్‌ వచ్చేసింది

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ డిఫరెంట్ జోనర్‌ సినిమాలు చేయడంలో తనదైన వైవిధ్యాన్ని చూపిస్తాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన 30వ చిత్రంగా ‘ఒకే ఒక జీవితం’లో నటిస్తున్నాడు. మనం ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలను చూసినప్పటికీ, ఒకే ఒక జీవితం మూవీ ఒక విలక్షణమైనది. ఈ మూవీ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మరీ ముఖ్యంగా తల్లీ కొడుకుల బంధం పరంగా చాలా కొత్తగా ఉంటుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ వరదిలారు మేకర్స్.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను తెలుగు, తమిళం రెండు భాషలలో విడుదల చేశాడు. ఈ ట్రైలర్ సినిమా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిరేపుతోంది. కథాంశాన్ని, పాత్రల భావోద్వేగాలను ఇందులో చూడొచ్చు. విజువల్స్‌ చూస్తుంటే.. సాంకేతిక పరంగా సినిమా గొప్పతనం తెలుస్తోంది. ఇందులో శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని అద్భుతంగా నటించగా.. రీతూ వర్మ హీరోయిన్ గా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి శర్వాకు స్నేహితులుగా అలరించారు.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సుజిత్ సారంగ్ కెమెరా మెన్ గా చేస్తుండగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కాబోతుంది.

నటీనటులు : శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది :
రచన, దర్శకత్వం : శ్రీ కార్తీక్
నిర్మాతలు : SR ప్రకాష్ బాబు, SR ప్రభు
నిర్మాణ సంస్థ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
డైలాగ్స్ : తరుణ్ భాస్కర్
DOP : సుజిత్ సారంగ్
సంగీత దర్శకుడు : జేక్స్ బిజోయ్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
ఆర్ట్ డైరెక్టర్ : ఎన్.సతీష్ కుమార్
విన్యాసాలు : సుదేష్ కుమార్
స్టైలిస్ట్ : పల్లవి సింగ్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్
PRO : వంశీ–శేఖర్