
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న 45 మంది పారిశుధ్య కార్మికులకు ఓకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్థ సభ్యులు పాల్గొన్నారు.