Ola Shakti: ఎనర్జీ స్టోరేజ్ వ్యాపారంలోకి ఓలా ఎలక్ట్రిక్.. కొత్తగా ఓలా శక్తి లాంచ్..

Ola Shakti: ఎనర్జీ స్టోరేజ్ వ్యాపారంలోకి ఓలా ఎలక్ట్రిక్.. కొత్తగా ఓలా శక్తి లాంచ్..

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఓలా కొత్తగా ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ మార్కెట్‌లో ప్రవేశించింది. ఇందుకోసం కొత్తగా ‘Ola Shakti’ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ లాంచ్ చేశారు. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా ఉత్పత్తిగా.. సోలార్ ఎనర్జీ స్టోరేజ్, పవర్ బ్యాకప్, వోల్టేజ్ స్థిరికరణ, పోర్టబిలిటీ వంటి అనేక సేవలను ఆఫర్ చేస్తోంది. ఓలా శక్తి డివైస్ 90% సమర్థత కలిగి ఉండి.. ఎక్కువసేపు పని చేస్తుందని భవిష్ చెప్పారు. అలాగే దీని నిర్వహణ కూడా చాలా తక్కువని చెప్పారు. 

ఓలా శక్తి బ్యాటరీ ప్యాక్‌ రూపంలో వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది రెండు అంతస్తుల భవనానికి, ఫారం హౌసులకు గంటల తరబడి బ్యాకప్ ఇస్తుందని సీఈవో చెప్పారు. ఏ సీజన్ల లోనైనా ఎయిర్ కండీషనర్లు వంటి పవర్ హెవీ పరికరాలను రన్ చేసే సామర్ధ్యం వీటికి ఉంది. పైగా ఈ వ్యవస్థను మొబైల్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేసే సౌకర్యం ఉందని వెల్లడైంది. 

►ALSO READ | దీపావళి ప్రమాదాలకు ఫోన్ పే ఇన్సూరెన్స్.. జస్ట్ రూ.11కే రూ.25వేల కవరేజ్..

ధర విషయానికి వస్తే.. ఇది నాలుగు విడతల్లో ఆఫర్ చేస్తోంది కంపెనీ. 1.5 kWh రూ.29వేల 999, 3 kWh రూ.55వేల 999, 5.2 kWh రూ.లక్ష19వేల 999, 9.1 kWh రూ.లక్ష 59వేల 999కు ఆఫర్ చేస్తోంది కంపెనీ. జస్ట్ రూ.999తో రిజర్వేషన్ ప్రారంభం కాగా డెలివరీ 2026 సంక్రాంతి నుంచి ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ రేట్లు మెుదటి 10 వేల యూనిట్లకేనని కంపెనీ చెబుతోంది. కంపెనీ దీని ద్వారా లాస్ట్ మైల్ గ్రిడ్ కాంప్లిమెంటేషన్ సొల్యూషన్స్ అందించాలని చూస్తోంది. పైగా ఓలా కంపెనీ ఈ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేసిన 4680 Bharat Cell టెక్నాలజీని ఆధారంగా తయారు చేస్తోంది.

ఓలా శక్తితో కంపెనీ ఇళ్ల నుంచి వ్యాపారాల వరకు బేటరీ ఎనర్జీ స్టోరేజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇది సోలార్, విండ్ ఎనర్జీ లాంటి రెన్యూవబుల్ విద్యుత్ సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పైగా క్లీన్ అండ్ గ్లీన్ ఎనర్జీని మరింత స్థిరంగా వాడుకునేందుకు వీలుంటుందని కంపెనీ చెబుతోంది.