న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ "ఓలా సోనా వీకెండ్" ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్లలో కస్టమర్లకు రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. అదనంగా, 24 క్యారెట్ బంగారు పూతతో కూడిన లిమిటెడ్ ఎడిషన్ ఓలా సోనా స్కూటర్ గెలుచుకునే అవకాశం కూడా ఉందని తెలిపింది. రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోవాట్ల బ్యాటరీ మోడల్‌పై రూ.50 వేల తగ్గింపు ఇచ్చి రూ.1,39,999కే అందుబాటులోకి తెచ్చామని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది.
ఈ ఆఫర్లు ఏప్రిల్ 18,19 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. అన్ని మోడల్స్‌పై రూ.40 వేల వరకు తగ్గింపులు, 8 ఏళ్ల వారంటీ, కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఓలా సోనా స్కూటర్‌లో 24 క్యారెట్ బంగారు పూతతో పాటు "సోనా మూడ్" అనే ప్రత్యేక ఫీచర్ ఉందని, మూవ్‌ఓఎస్ డ్యాష్‌బోర్డ్ ద్వారా రైడ్ మోడ్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చని తెలిపింది.

