రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తీవ్ర అనారోగ్యం!

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తీవ్ర అనారోగ్యం!

రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారని తెలిపారు బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు... ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపెడుతూ... అమెరికాకు చెందిన మ్యాగ్ జైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కచ్చితంగా పుతిన్ అనారోగ్య సమస్య ఏమిటో తెలియదని.. అది నయమయ్యేదేనా.. కాదా.. అనేది తెలియట్లేదన్నారు. యుద్ధ సమీకరణాల్లో అదీ ఒక భాగమే అన్నారు. ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుతిన్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారని తెలిపారు. రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి కూడా పుతిన్ అనారోగ్యాన్ని ధ్రువీకరించారు. కేన్సర్ చికిత్సలో భాగంగా..  పుతిన్ వెన్నుకు సర్జరీ జరిగిందని.. ఉక్రెయిన్ పై యుద్ధ ప్రకటనకు ముందు ఇది జరిగిందన్నారు. పుతిన్ వెర్రి నిర్ణయంతో ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోందని చెప్పారు.