పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు కసరత్తు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు కసరత్తు
  • భేటీ అయిన వెంకయ్యనాయుడు, ఓం బిర్లా
  • తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెండు గంటల పాటు చర్చ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిర్వహణకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమావేశాలు ఎలా నిర్వహించాలనే అంశంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌‌ ఓం బిర్లా సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ అంశంపై దాదాపు 2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ కరోనా ప్రమాణాలకు అనుగుణంగా సభ్యులకు భద్రత కల్పించే అంశాలపై కూడా చర్చించారు. ఈ మేరకు సీటింగ్‌ సామర్థ్యం ఎంత ఉంది అనే అంశంపై సమీక్ష చేశారు. ఉభయ సభల గ్యాలరీలను పరిశీలించారు. రోజు విడిచి రోజు సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఒకరోజు, రాజ్యసభ ఒక రోజు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సెక్రటరీ జనరల్‌కి సూచించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించి అవకాశాలను పరీశీలించానలి వెంకయ్యనాయుడు, ఓం బిర్లా అధికారులను సూచించారు.