బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాజీనామా చేస్తా..ఒమర్ అబ్దుల్లా

బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాజీనామా చేస్తా..ఒమర్ అబ్దుల్లా
  • జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదా కోసం తాను రాజీపడబోనని సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే రాష్ట్ర హోదా ఇస్తామని అంటే.. సీఎం పోస్టుకు రాజీనామా చేస్తా కానీ ఆ పార్టీతో కలవబోనని స్పష్టం చేశారు. మంగళవారం అనంతనాగ్ జిల్లాలోని అచాబల్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్లా మాట్లాడారు. 

‘‘బీజేపీతో పొత్తు పెట్టుకుని, ప్రభుత్వం లో దానికి భాగస్వామ్యం కల్పిస్తే బహుశా కాశ్మీర్​కు రాష్ట్ర హోదా తొందరగా వస్తుందేమో. కానీ, దానికోసం నేను రాజకీయంగా రాజీ పడలేను. ఒకవేళ దానికి మీరు సిద్ధపడితే చెప్పండి. నేను రిజైన్​చేస్తా. 

ఎమ్మెల్యేల్లో ఎవరినైనా సీఎంగా ఎన్నుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి” అని చెప్పారు.