ఓఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జి మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

ఓఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జి మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

నందితా శ్వేత లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన హారర్ కామెడీ మూవీ ‘ఓఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జి’ (ఓ మంచి ఘోస్ట్). వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకుడు. డా.అబినికా ఇనాబతుని నిర్మాత. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీజర్ మొదలైంది.

హారర్, కామెడీ కలగలిసిన విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఘోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నందితా శ్వేత లుక్ భయపెడుతుండగా..  ‘నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైనా, కాంచన కజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైనా’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది.  అతి త్వరలో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలియజేశారు.