విజృంభిస్తున్న ఒమిక్రాన్.. 350 దాటిన కేసులు

విజృంభిస్తున్న ఒమిక్రాన్.. 350 దాటిన కేసులు

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 358కి చేరింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 88 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. 67 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 38, తమిళనాడు 34, కర్నాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్ 22, హర్యానా, ఒడిశాల్లో 4, జమ్మూకాశ్మీర్, బెంగాల్ లో 3, ఏపీ, యూపీల్లో 2, చండీఘడ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్ లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో ఇప్పటి వరకు 114 మంది కోలుకున్నారు.

తమిళనాడులో గురువారం రికార్డు స్థాయిలో 33 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 23 మందికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. వారిలో 17మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. పేషెంట్లలో నలుగురు 18ఏళ్లలోపు వారున్నారు. కర్నాటకలో నిన్న 12 కేసులు రాగా వారిలో 10 బెంగళూరులోనే నమోదయ్యాయి. మిగిలిన ఇద్దరు మైసూరు, దక్షిణ కన్నడ ప్రాంతాలకు చెందినవారు.

మరిన్ని వార్తల కోసం..

గూగుల్ను దాటిన టిక్ టాక్

2 వారాలు ఆంక్షలు అమలు చేయాలని సూచన  

టార్గెట్ 90 ..అమిత్ షా వ్యూహం