దేశంలో 1,892కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో 1,892కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే.. అందులో 799 మంది కోలుకున్నట్లు తెలిపారు  అధికారులు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.

మరో వైపు కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 37 వేల 379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు వ్యాక్సినేషన్ స్పీడప్ చేసింది కేంద్రం. నిన్నటి నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలైంది. 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 40లక్షల మందికి పైగా టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.