ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దు.. ఇది ప్రాణాంతకం

ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దు.. ఇది ప్రాణాంతకం

జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ ప్రాణాంతకమని తెలిపింది. కొత్త వేరియంట్ బారిన పడిన వారు కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొంది. ఈ వేరయంట్ ను అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇది చివరి వేరియంట్ కాదన్న WHO.. వారం వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా 71 శాతం కేసులు పెరిగాయని వివరించింది. ‘డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ అంత డేంజర్ గా అనిపించకపోవచ్చు. 

ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అంత ప్రమాదకర లక్షణాలు కనిపించడం లేదు. కానీ దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇంతకు ముందు వచ్చిన వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ బారిన పడిన వారు కూడా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తుంది. దీని వల్ల చనిపోయే ప్రమాదం  కూడా ఉంది. తక్కువ వ్యవధిలో భారీ ఎత్తున ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటం తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. ఇది ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతోంది’ అని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ పేర్కొన్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం: 

సీఎం వరి వేయొద్దంటే.. ఎమ్మెల్యే నాటేసిండు..

అన్ని భాషల్లో మానాడు

పిల్లలు చెబితే వినట్లేదా?.. ఈ టిప్స్ పాటించండి