
పిల్లలు ఒక్కోసారి మాట వినరు. ఫలానా పని చేయొద్దని ఎంత చెప్పినా వినిపించుకోరు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వాళ్లని కోప్పడతారు. దాంతో కొందరు పిల్లలు మూడీగా ఉండి, ఏం తినరు. ఎవరితోనూ మాట్లాడరు. అలాగని వాళ్లని ఒంటరిగా వదిలేయకూడదు. పిల్లలతో మాట్లాడాలి.
- పిల్లల్ని తిట్టినా, కోప్పడినా ఆ వెంటనే వాళ్లని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. ఫలానా పని ఎందుకు చేయకూడదో వివరంగా చెప్తే, పిల్లలు అర్థం చేసుకుంటారు. తమ బాధను తల్లిదండ్రులతో చెప్పుకునే ఫ్రీడమ్‌ను పిల్లలకు ఇవ్వాలి. వాళ్లని మూడీ ఫీలింగ్ నుంచి బయటపడేయడానికి పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం.
- పిల్లలతో గడిపేందుకు రోజూ కొంచెం టైమ్ ఇవ్వాలి. వాళ్లతో గేమ్స్ ఆడటం, పజిల్స్ సాల్వింగ్‌లో సాయం చేయడం ద్వారా తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధం బలపడుతుంది.
- పిల్లలు ఒకే పొరపాటును రిపీట్ చేయకుండా తల్లిదండ్రులు గమనించాలి. తప్పొప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం వాళ్లకు అలవాటు చేయాలి