
బ్రిటన్ నుంచి రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నెగెటివ్ గా తేలింది. జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టులో మహిళకు నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా మరో 12 మంది బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల జీనోమ్ రిపోర్టు రావాల్సి ఉంది. జీనోమ్ సీక్వెన్స్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన మహిళకు.... కరోనా పాజిటివ్ రావటంతో ప్రస్తుతం ఆమె టిమ్స్ లో చికిత్స పొందుతుంది.