జూన్ 23న వాళ్లకు మళ్లీ NEET పరీక్ష

జూన్ 23న వాళ్లకు మళ్లీ NEET పరీక్ష

నీట్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నీట్ లో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్నారు. నీట్ పరీక్షలో సమస్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన విషయంలో.. రాజకీయాలు చేయొద్దని సూచించారు. 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రాశారని చెప్పారు. వీరిలో 15వందల 63 మంది విద్యార్థులకు సంబంధించిన సమస్యను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. దేశంలో నీట్, JEE, CUET పరీక్షలను NTA విజయవంతగా నిర్వహిస్తోందన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.  

మరోవైపు 15వందల 63 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను తొలగిస్తున్నట్లు NTA తెలిపింది. వీరికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మళ్లీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈమెయిల్, మెసేజ్ ల ద్వారా సమాచారం అందిస్తామని తెలిపింది NTA.