ఫిబ్రవరి 2న  మ్యారేజి బ్యాండు మల్లి

 ఫిబ్రవరి 2న  మ్యారేజి బ్యాండు మల్లి

సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్, వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని నాగరం, శరణ్య ప్రదీప్ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, పాటలతో ఆకట్టుకున్న టీమ్.. మంగళవారం మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల  చేసిన సుహాస్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

అద్ధంలో తనను తాను చూసుకుంటున్నట్టు కనిపిస్తుండగా, ముందు జుట్టు ఉంటే.. వెనుక నుంచి గుండు  కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో సుహాస్  కనిపించనున్నాడు. ఇదొక కామెడీ డ్రామా.  వైవిధ్యమైన కథా కథనాలతో ఆడియెన్స్‌‌‌‌కు యూనిక్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.