ముంబైలో శ్రద్ధ ఫ్రెండ్స్​ స్టేట్​మెంట్​ రికార్డు

ముంబైలో శ్రద్ధ ఫ్రెండ్స్​ స్టేట్​మెంట్​ రికార్డు

ఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను పోలీసులు వేగంగా పుర్తి చేస్తున్నారు. సోమవారం అఫ్తాబ్​కు రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్​ అంబేద్కర్​ హాస్పిటల్​లో నార్కో టెస్టు చేసే అవకాశం ఉంది. మంగళవారంతో 5రోజుల పోలీస్​ కస్టడీ ముగుస్తుంది. ప్రీ నార్కో టెస్టులో అఫ్తాబ్​ మానసిక ప్రవర్తన చూశాకే ఫైనల్ నార్కో టెస్టు చేస్తారు. పోలీసుల నుంచి నార్కో టెస్టుపై ఎలాంటి సమాచారం లేదని డాక్టర్లు చెప్పారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదన్నారు. అఫ్తాబ్​ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సైకలాజికల్లీ ఫిట్​గా ఉన్నట్టు మెడికల్ ఆఫీసర్​ నిర్ధారిస్తేనే నార్కో టెస్టు చేస్తామన్నారు. బ్రెయిన్​ మ్యాపింగ్, పాలీగ్రాఫ్​ టెస్ట్​కు అఫ్తాబ్ అనుమతి కీలకమని చెప్పారు.

పరారీలో అఫ్తాబ్​ ఫ్యామిలీ

అరెస్టుకు ముందే అఫ్తాబ్ తన ఫ్యామిలీని దివాళీ టైంలో వసాయ్​ నుంచి మీరా రోడ్​ సొసైటీకి షిఫ్ట్​ చేశాడు. డీ బ్లాక్​లోని 11వ అంతస్తులో అఫ్తాబ్​ఫ్యామిలీ ఉండేదని, వారం రోజుల నుంచి ఫ్లాట్​కు తాళంవేసి ఉందని పక్కింటోళ్లు పోలీసులకు చెప్పారు. 2020 డిసెంబర్​లో శ్రద్ధకు హెల్ప్​ చేసిన రాహుల్​ రాయ్, గాడ్విన్​ స్టేట్​మెంట్​లను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. కాగా, సౌత్ ​ఢిల్లీలోని అఫ్తాబ్, శ్రద్ధ ఇంటి నుంచి పోలీసులు కొన్ని బట్టలతో పాటు పదునైన ఆయుధాలను కలెక్ట్​ చేసి ఎగ్జామినేషన్​కు పంపించారు. హత్య జరిగిన టైంలో శ్రద్ధ, అఫ్తాబ్​ వేసుకున్న డ్రెస్సులు మాత్రం దొరకలేదు. మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ బాడీ పార్ట్స్​ కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.