
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యాడ్’. హారికా అండ్ హాసినీ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కూతురు హారిక ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా పరిచయమవుతోంది. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
రక్షా బంధన్ సందర్భంగా గురువారం ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ, టీజర్‌ను రిలీజ్ చేశారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గొడవలు, ర్యాగింగ్, ఫ్రెండ్‌షిప్, లవ్ లాంటి అంశాల చుట్టూ తిరిగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. నాగవంశీ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.