సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం

సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం
  • జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం

హైదరాబాద్, వెలుగు :  సెప్టెంబర్ 17ను ‘ప్రజాపాలన దినోత్సవం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పబ్లిక్ గార్డెన్స్​లో అధికారికంగా నిర్వహిస్తున్నది. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడుతారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో వేడుకలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.