
* 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో మిలిటరీ గవర్నర్‌గా జయంత్‌నాథ్ చౌదరి పరిపాలనా బాధ్యతలు చేపట్టారు.
* దేశంలోనే అతిపెద్ద బ్రిటీష్ సైనిక స్థావరమైన సికింద్రాబాద్ బైసన్ డివిజన్లో జేఎన్ చౌదరి పనిచేశారు.
* ఆపరేషన్ పోలోకు ఆపరేషన్ కాటర్‌పిల్లర్ అనే మరో పేరుంది.
* 1938లో బ్రిటీష్ ఆర్మీ సికింద్రాబాద్ డివిజన్‌కు, నిజాం సైన్యానికి మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి.
* ఆపరేషన్ పోలో సమయంలో భారత సైన్యానికి ముఖ్యంగా జేఎన్ చౌదరికి నిజాం రాజ్య సైన్యాధిపతి మేజర్ జనరల్ ఇ.ఎల్. ఎడ్రూస్ సహాయపడ్డాడు.
* 1948 సెప్టెంబర్ 24 నుంచి 1949 డిసెంబర్ 31 వరకు హైదరాబాద్‌లో మిలటరీ గవర్నర్ కార్యనిర్వాహక మండలి. 1. మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి, 2. చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ డి.ఎస్. బాక్లే, 3. అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ డి.ఆర్.ప్రధాన్(ఐసీఎస్).
* మిలటరీ గవర్నర్ పాలనా కాలంలో పరిపాలన రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీద జరిగేది.
* నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్‌ప్రముఖ్‌గా 1950 జనవరి 26న నియమింపబడ్డాడు.
* 1949 ఫిబ్రవరి 6న నిజాం సొంత ఆస్తిగా భావించే సర్ఫేఖాస్, నిజాం రాజ్య కరెన్సీ హాలిసిక్కాను రద్దు చేశారు.
* హైదరాబాద్ రాజ్యంలో అంతకుముందు ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవు దినంగా ఉండేది.
* 1949 ఫిబ్రవరి 6న విడుదల చేసిన ఫర్మానా ప్రకారం సెలవు దినం శుక్రవారం నుంచి ఆదివారానికి మార్చారు.
* నిజాం కు చెందిన సర్ఫేఖాస్ భూములను స్వాధీనం చేసుకున్న భారత ప్రభుత్వం అందుకు నష్టపరిహారంగా రూ.3కోట్ల ధనం చెల్లించింది.
* హైదరాబాద్‌లో ఉన్ జాగిర్దారీ వ్యవస్థ మిలటరీ గవర్నర్ జె.ఎన్.చౌదరి కాలంలో రద్దయింది.
* భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వం భూములున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది.
* హైదరాబాద్ రాష్ట్రంలో ఫసలీ నెలలు రద్దయి, వాటి స్థానంలో ఇంగ్లీష్ నెలలు 1946 అక్టోబర్‌లో వాడుకలోకి వచ్చాయి.
* జేఎన్ చౌదరి పాలనా కాలంలో ఆయన కింద సివిల్ అడ్మినిస్ట్రేట్ అనే పౌర పరిపాలన శాఖ ఏర్పాటు చేయబడింది.
* జేఎన్ చౌదరి పాలనా కాలంలో సివిల్ అడ్మినిస్ట్రేట్కు అత్యున్నతాధికారి చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ (ఇతనికి దాదాపు ముఖ్యమంత్రి హోదా ఉండేది).
* కమ్యూనిస్టులు రెండో దశ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 1947 సెప్టెంబర్ 11న పిలుపునిచ్చింది.
* కమ్యూనిస్టులపై భారత సైన్యం ఊచకోత 1951 అక్టోబర్ 21 వరకు కొనసాగింది.
* హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారు విధానాన్ని 1949 ఆగస్టులో రద్దు చేశారు.
* ముస్లింలపైన జరిగిన దాడులను విచారించడానికి 1949 అక్టోబర్‌లో భారత ప్రభుత్వం పండిట్ సుందర్‌లాల్ కమిటీని ఏర్పాటు చేసింది.
* పండిట్ సుందర్‌లాల్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి 1949 డిసెంబర్ 21న నివేదిక సమర్పించింది.
* ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్‌పై జరిగిన పోలీసు చర్య సమయంలో, తదనంతరం దాదాపు 20000 నుంచి 40000 మంది ప్రజలు మరణించారని సుందర్‌లాల్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.
* సుందర్‌లాల్ కమిటీ నివేదిక అనంతరం కేంద్ర ప్రభుత్వం జేఎన్ చౌదరిని 1949 డిసెంబర్ 31న తొలగించింది.
* సుందర్‌లాల్ కమిటీ నివేదికను ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలోని లైబ్రరీలో భద్రపరిచారు.
* జేఎన్ చౌదరి తర్వాత 1950 జనవరి 1 నుంచి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐసీఎస్ అధికారి ఎం.కె.వెల్లోడిని నియమించారు.
* ఎంకే వెల్లోడి మంత్రివర్గంలోని సభ్యులు. ఎం.శేషాద్రి, సి.వి.ఎస్.రావు, నవాజ్ జైన్ యార్జంగ్, బూర్గుల రామకృష్ణారావు, పూల్‌చంద్ ప్రేమ్‌చంద్ గాంధీ, వినాయకరావు కొరాట్కర్, వి.బి.రాజు.
* ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వామి రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి పార్లమెంట్‌కు నామినేట్ చేయబడ్డారు.
* 1950 జనవరి 1 నుంచి 1952 జనవరి 31 వరకు వెల్లోడి మంత్రి మండలి పాలన సాగించింది.
* 1949 ఫిబ్రవరిలో నిజాం నవాబు – భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నిజాంకు వివిధ ఖర్చుల కోసం రూ.1.50కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
* హైదరాబాద్ రాజ్యంలో పౌర ప్రభుత్వం ఏర్పడిందని, నిజాం రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్నాడని 1949లో ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి రామస్వామి మొదలియార్ ప్రకటించారు.