హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్

హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్
  • హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్
  • జాయినింగ్స్, భవిష్యత్తు కార్యాచరణపై అధిష్టానం ఫోకస్

హైదరాబాద్, వెలుగు : బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల టైం మాత్రమే ఉండడంతో చేరికలను స్పీడప్ చేయడం, జనం సమస్యలపై పోరాడటం వంటి వాటిపై హైకమాండ్​ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్, కాం గ్రెస్​లో ఉన్న అసంతృప్తులను పార్టీలో చేర్చుకుని బీజేపీని బలోపేతం చేయాలనే దిశగా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే సంజయ్​కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

కొంతకాలంగా ఇతర పార్టీల సీనియర్ నేతల చేరికలు ఆగిపో యాయి. ఇటీవల రాష్ట్ర పర్యటనలకు అమిత్ షా, జేపీ నడ్డా వచ్చిన సందర్భంలోనూ చేరికలపై ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, చేరికలను ప్రోత్సహించాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా, నడ్డా దిశానిర్దేశం చేశారు. ఇంకో వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కూడా ఇటీవల చేరికలపైనే రాష్ట్ర సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

పార్టీ బలోపేతంపై చర్చించాం : సంజయ్​

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నేతలతో చర్చించినట్లు సంజయ్​ తెలిపారు. అక్రమ అరెస్ట్​ గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. కేసీఆర్​ అరాచకాలన్నీ పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. బూత్​ స్వశక్తి కరణ్​ అభి యాన్​ మీటింగ్​లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. జూపల్లి చేరికపై డీకే అరుణ మాట్లాడారని, 15న వరంగల్​లో నిరుద్యోగ మార్చ్​ నిర్వహిస్తున్నామని తెలిపారు.