దివాళీ స్పెషల్ : హైదరాబాద్ -కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు

దివాళీ స్పెషల్ : హైదరాబాద్ -కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.  ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ హైదరాబాద్ టూ  కటక్ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపేందుకు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్ –- కటక్​ మధ్య దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లు నడుపుతుంది. 

2023, నవంబర్ 7, 14, 21 తేదీల్లో హైదరాబాద్–-కటక్, అలాగే 8,15, 22 తేదీల్లో కటక్ – -హైదరాబాద్​కు స్పెషల్​రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 

Also Read :- ఇవాళ బండి సంజయ్ నామినేషన్

హైదరాబాద్‌–కటక్‌ (07165/07166) ప్రత్యేక రైలు 2023, నవంబర్ 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.45 గంటలకు కటక్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కటక్‌ నుంచి బయల్దేరి మర్నాడు రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.