‘ఆదిపురుష్’ అప్‌‌‌‌డేట్స్ ఆన్‌‌‌‌ ద వే

 ‘ఆదిపురుష్’ అప్‌‌‌‌డేట్స్ ఆన్‌‌‌‌ ద వే

‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు  ఓం రౌత్‌‌‌‌ ఈ మైథలాజికల్ మూవీని రూపొందిస్తు న్నాడు. షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా రిలీజ్ చేయనున్నట్టు కూడా అనౌన్స్ చేసేశారు. కానీ ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించి ఏ ఒక్క లుక్‌‌‌‌ను రివీల్ చేయకపోవడం, ఎలాంటి అప్‌‌‌‌డేట్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే గ్రాఫిక్స్‌‌‌‌కు ఇంపార్టెన్స్ ఉన్న చిత్రం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌కు ఎక్కువ టైమ్ పడుతోందని చెబుతున్న మేకర్స్..  అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రమోషన్స్‌‌‌‌పై ఫోకస్ పెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

కానీ ఒక నెల ముందుగానే అంటే సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నుంచే ‘ఆదిపురుష్​’కి సంబంధించిన వరుస అప్‌‌‌‌డేట్స్ ఇచ్చేలా మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌‌‌‌డే సందర్భంగా ఫ్యాన్స్‌‌‌‌కి అదిరిపోయే ట్రీట్ కూడా ఉండబోతోందట. రాముడిగా కనిపించనున్న ప్రభాస్‌‌‌‌ను చూడటానికి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ న్యూస్ కొంత ఊరటనిచ్చింది. సీతగా కృతీ సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ నిర్మిస్తున్నారు. పదిహేను భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ రిలీజ్‌‌‌‌కి ప్లాన్ చేస్తున్నారు.