న్యూ ఇయర్ సెలబ్రేషన్స్సందర్భంగా కల్లుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. తాటి,ఈత కల్లు తాగేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెండు మూడు రోజుల ముందుగానే కల్లును బుక్ చేసుకున్నారు. చాలామంది కల్లును బాటిల్స్ తో తీసుకువెళ్తున్నారు. కొత్త ఏడాది సందర్భంగా తమకు గిరాకీ పెరిగిందని కల్లుగీత కార్మికులు చెబుతున్నారు. కల్లు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్లు తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
వైన్ షాపుల వద్దకు వెళ్లి ఎర్రమందు తాగితే ఆరోగ్యం కరాబ్ అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే కల్లు తాగేందుకు ఇష్టపడుతున్నామని తెలిపారు. కల్లు తక్కువ ఖర్చుతో లభించడంతో లక్ష్మీపూర్ లో మెజార్టీ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.