తగ్గిన గోల్డ్ ధర.. అదే బాటలో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తగ్గిన గోల్డ్ ధర.. అదే బాటలో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై : ఒకవైపు యూఎస్ బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రాబడి) లు పెరుగుతుండడంతో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చే ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు తగ్గుతున్నాయి. సాధారణంగా పెరుగుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హెడ్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈసారి బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ  వడ్డీని ఇస్తోంది. ఫలితంగా ఎటువంటి వడ్డీ ఇవ్వని గోల్డ్, సిల్వర్ వంటి ప్రీసియస్ మెటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు తగ్గుతున్నాయి. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గోల్డ్ ధరలు తగ్గడంతో లోకల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ ఉన్నప్పటికీ  దేశ  ఎంసీఎక్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగారం రేటు సోమవారం భారీగా పతనమైంది. 10 గ్రాముల గోల్డ్ రేటు (ఫ్యూచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రూ.700 (1.3 శాతం)  నష్టపోయి రూ.51,329 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇదే అతిపెద్ద సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే లాస్ కావడం గమనించాలి.  కేజీ సిల్వర్ రేటు (ఫ్యూచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సోమవారం రూ. 1,500 (2.5 శాతం) తగ్గి రూ.59,340  వద్ద ట్రేడవుతోంది. యూఎస్ బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గరిష్టాల్లో ఉండడం, డాలర్ వాల్యూ పెరుగుతుండడంతో ఇంటర్నేషనల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఔన్సు (సుమారు 28 గ్రాములు) గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర  0.7 శాతం తగ్గి 1,682 డాలర్లకు పడిపోయింది.  సిల్వర్ రేటు ఔన్సుకి 1.8 శాతం తగ్గి 19.74 డాలర్ల వద్ద కదులుతోంది.  

బులియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగెటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  జారుకుందని, గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  1,700 డాలర్ల (ఔన్సు) లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందకు పడిందని  మెహతా ఈక్విటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ (కమొడిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రాహుల్ కలంత్రి అన్నారు. యూఎస్  సెప్టెంబర్ జాబ్స్ డేటా మెరుగ్గా ఉండడంతో ఫెడ్  వడ్డీ రేట్లను  రానున్న పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 75 బేసిస్ పాయింట్లు పెంచుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. ‘యూఎస్ ఎకానమీ డేటా డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు  మద్ధతుగా నిలుస్తోంది. గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఔన్సు) కు ఇంటర్నేషనల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  1,682–1,670 డాలర్ల వద్ద సపోర్ట్ లభిస్తోంది.  1,708–1,716 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఉంది.  సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఔన్సు) కు  19.65– 19.48 డాలర్ల వద్ద సపోర్ట్ లభిస్తోంది. 20.17–20.35 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఉంది. దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూస్తే గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10 గ్రాముల) కు రూ. 51,620–51,440 వద్ద సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ.52,210, రూ. 52,350 వద్ద రెసిస్టెన్స్ ఉన్నాయి. సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.60,050–59,340 వద్ద సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ. 61,280– 61,610  వద్ద రెసిస్టెన్స్ ఉన్నాయి’ అని రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలంత్రి అన్నారు. 

మళ్లీ నష్టాల్లోనే..
బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  సోమవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ ఇంట్రాడే నష్టాలను తగ్గించు కున్నాయి. అయినప్పటికీ చివరికి లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ముగిశాయి. సెన్సెక్స్ 200 నష్టపోయి 57,991 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 74 పాయింట్లు తగ్గి 17,241 వద్ద సెటిలయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెక్టార్ల  పరంగా చూస్తే నిఫ్టీ కన్జూమర్ డ్యూరబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మీడియా, రియల్టీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌50, స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ 50 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాత్రం ఎక్కువగా లాభపడ్డాయి. ‘యూఎస్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డేటా మెరుగ్గా ఉండడంతో ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందనే భయాలు గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెరిగాయి.

డిమాండ్ ఎక్కువ, సప్లయ్ తక్కువగా ఉండడంతో యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ గరిష్ట లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉంటుందని అంచనా. ఎకానమీని బ్యాలెన్స్ చేసేందుకు నిరుద్యోగ రేటును పెంచి  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫెడ్ తగ్గించాల్సి ఉంటుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. దీనికి అదనంగా  డాలర్ మారకంలో రూపాయి పతనం, క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్ ధరలు పెరగడం వంటి అంశాలు లోకల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. డాలర్ మారకంలో రూపాయి 82.32 వద్ద ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్లోజయ్యింది. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 97.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.