KTR : మోడీ, అదానీపై కేటీఆర్ పరోక్ష విమర్శలు

KTR : మోడీ, అదానీపై కేటీఆర్ పరోక్ష విమర్శలు

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ‘1992 -A స్కామ్ అనే ఒక వెబ్ సిరీస్ చూశాను. అందులో ఇద్దరు గుజరాతీ బ్రదర్స్ దేశవ్యాప్తంగా బైక్ రైడ్ చేశారు. వారు వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేనేది మనమంతా ఇప్పుడు  స్తున్నాం. చరిత్ర ఎప్పుడు పునరావృతం కాదని ఈ ఘటన నిరూపితమైంది’ అంటూ ట్వీట్ చేశారు.  

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదానీ గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శలు చేశారు. 

నిన్న ఏమన్నారంటే...

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ..కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూప్‌ స్టాక్‌ల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి..? ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారు? అంటూ పలు ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలు ఇవి అంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు.