జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల లొల్లి 

జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల లొల్లి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బండి సంజయ్ పాదయాత్ర చేయబోయే గ్రామాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. జనగామ నుండి సూర్యాపేట వెళ్లే దారిలో బీజేపీ నాయకులు రోడ్డు కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే.. గుర్తు తెలియని వ్యక్తులు వీటిని చించివేశారు. కావాలనే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు రేపు బండి సంజయ్ పాదయాత్ర జనగామ చేరుకోనుంది. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో BJP-,TRS కార్యకర్తలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. జిల్లాలో పర్యటించాలంటే కేంద్ర నిధులపై బండి సంజయ్ స్పష్టత ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో పలు చోట్ల టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. మరోవైపు పలు గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.