
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘కె ర్యాంప్’. యుక్తి తరేజా హీరోయిన్. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.
ఇవాళ (ఆగస్టు 9న) రాఖీ స్పెషల్గా ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సురేంద్ర లిరిక్స్ అందించిన ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఎనర్జిటిక్ ట్యూన్ అందించారు.
‘ఇన్‌స్టా ఆపేశానే.. ట్విటర్ మానేశానే.. నీకే ట్యాగేసానే మలయాళీ పిల్లా.. ఫోన్ మార్చిషాలే.. చాటింగ్ ఆపేసాలే.. నీకే సింక్ అయ్యాలే.. వదలను ఇల్లా.. ’ అంటూ సాగే ఈ పాట యూత్కి కనెక్ట్ అయ్యేలా సాగింది. కేరళ పండుగ ఓనమ్ నేపథ్యంలో సాగే ఈ పాట ముఖ్యంగా.. మలయాళ ట్రెడిషన్ చూపించేలా కలర్ ఫుల్‌గా తెరకెక్కించారు.
ALSO READ : కాశీ చరిత్ర ఆధారంగానే మహేష్ మూవీ..
ఇందులో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న ఈ మూవీ విడుదల కానుంది.