SSMB29: కాశీ చరిత్ర ఆధారంగానే మహేష్ మూవీ.. పోస్టర్తో చాలా విషయాలు వెల్లడించిన జక్కన్న!

SSMB29: కాశీ చరిత్ర ఆధారంగానే మహేష్ మూవీ.. పోస్టర్తో చాలా విషయాలు వెల్లడించిన జక్కన్న!

దర్శక ధీరుడు రాజమౌళి శైలి, తన ఆలోచన విధానం వేరే. అందరీలా కామన్గా ఆలోచించడు. నిజం చెప్పాలంటే.. రాజమౌళి ఆలోచన ఎవ్వరికీ అంత త్వరగా అంతు చిక్కదు. తాను తీసిన చిత్రాలే అందుకు ఉదాహరణ. మీరు గమనించి చూస్తే.. లైఫ్‌స్టైల్ అడ్వెంచర్, ఇతిహాస కథనాలకు రాజమౌళి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశాలకు తోడు హ్యూమన్ ఎమోషన్స్ను కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ అంశాలతోనే రాజమౌళి వరుస విజయాలు అందుకుంటున్నారు. అలాంటి జక్కన్న సూపర్ స్టార్ మహేష్తో SSMB29మూవీ ఎలా తెరకెక్కించనున్నాడనేది ఉహకందని ఆలోచనగా మారింది.

ఈ క్రమంలోనే ఇన్నాళ్లు SSMB29 కథపై చాలా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఇవాళ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో ఓ క్లారిటీ వచ్చింది. కొంతలో కొంత విలువైన సమాచారమే రివీల్ అయింది. మరి అదేంటో చూద్దాం. 

రాజమౌళి షేర్ చేసిన ఫోటో, పెట్టిన క్యాప్షన్ సినిమా కథను చెబుతున్నట్లు అర్ధమవుతుంది. మహేష్ మెడలో నందీశ్వరుడితో కుడిన త్రిశూలం, లాకెట్ ధరించిన మహేష్ ఛాతి, గుండెపై రక్తపు ధారలు.. ఇవన్నీ తన అసాధారణమైన శక్తిని సూచించేలా ఉన్నాయి. అలాగే, #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్‌.. సినిమా కథను వివరించేలా ఉంది. ఇందులో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్లు పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.

SSMB29 కథ:

ఇంకాస్తా లోతుగా పరిశీలన చేస్తే.. SSMB29 మూవీ.. చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని తెలుస్తోంది. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రముఖ నివేదికలు కూడా చెప్పుకొచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో భారీ సెట్‌లో SSMB29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది కూడా. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట అన్నమాట. 

ఈ మూలకథకు అనుగుణంగానే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఉండటం గమనార్హం. మహేష్ మేడలో నందీశ్వరుడితో కుడిన త్రిశూలం ఉండటంతో ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాకుండా ఇండియా జోన్స్, ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్ నుంచి కూడా కథ ప్రేరణ తీసుకున్నట్లు టాక్. ఇందులో మహేష్ ఒక అన్వేషకుడిగా కనిపించబోతున్నట్లు, తెలియని భూబాగం నుంచి ప్రకృతి, రహస్య, శక్తివంతమైన శత్రువులతో అతను పోరాటం చేయబోతున్నట్లు సమాచారం.

►ALSO READ | వెండితెర బద్దలే: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 పై రాజమౌళి బిగ్ అప్డేట్

అయితే, ప్రపంచాన్ని మార్చగల.. దీర్ఘకాలంగా కోల్పోయిన ఓ రహస్యాన్ని వెలికీ తీయడానికి.. మహేష్ అన్వేశికుడిగా ప్రయాణం చేస్తాడని కూడా టాక్ ఉంది. ఏదేమైనా.. రాజమౌళి ఊహాశక్తిని అంత త్వరగా అర్ధం చేసుకోవడం కూడా కష్టమేనని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే .. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ నటుడు మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.