మళ్లీ పరారైన వరుడి తండ్రి, వధువు తల్లి

మళ్లీ పరారైన వరుడి తండ్రి, వధువు తల్లి

కొద్ది రోజుల క్రితం వధువు తల్లి, వరుడి తండ్రి కలిసి పరారైన ఘటన సూరత్‌లో జరిగింది. అయితే వారు తమ తప్పును తెలుసుకుని తిరిగి ఇంటికొచ్చారు. అయితే వారు చేసిన తప్పును ఆయా కుటుంబాలకు చెందిన సభ్యులు ఒప్పుకోలేదు. అంతేకాదు అవమానించారు. దీంతో మనస్థాపం చెందిన ఆ ఇద్దరూ మరోసారి పారారైయ్యారు. 46 ఏళ్ల హిమ్మత్‌పాండే తన  కుమారుడికి విజాల్‌పురి పట్టణానికి చెందిన 43ఏళ్ల శోభనా రావల్  కుమార్తెతో పెళ్లి కుదిరింది. పెళ్లికి  రెండు కుటుంబాల వాళ్లు రెడీ అయ్యారు. అదే సమయంలో హిమ్మత్‌పాండే, శోభనలు పరారయ్యారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.  వారిద్దరి విషయం రెండు కుటుంబాల సభ్యులు దాదాపు మర్చిపోయారు.

అయితే పిల్లలకు పెళ్లి చేయాల్సిన తాము ఇలాంటి పనిచేయడం సరికాదని పశ్చాత్తాప పడిన హిమ్మత్‌పాండే, శోభనలు తిరిగి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఇంటికొచ్చిన శోభనను భర్త అంగీకరించకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలిసిన పాండే తట్టుకోలేక పోయాడు. అవమానాన్ని భరించడం ఇష్టం లేని ఇద్దరూ లేటెస్టుగా మరోమారు కలసి పరారయ్యారు. సూరత్‌లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు.

ఆ ఇద్దరికీ యంగ్ ఏజ్ నుంచే పరిచయం ఉంది. అప్పట్లో పెళ్లి చేసుకోలేకపోయారు. అయితే పిల్లల పెళ్లి కోసం కలవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వెళ్లిపోయారు.