
ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు ఆటలో ఇండియన్ బౌలర్ సిరాజ్‌కు మరోసారి అవమానం జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌పై స్టాండ్స్‌లోని ప్రేక్షకులు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. దాంతో సిరాజ్.. కెప్టెన్ రహానేతో పాటు అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దాంతో అంపైర్లు ఆటను పది నిమిషాల పాటు నిలిపివేశారు. సిరాజ్ ఫిర్యాదుతో పోలీసులు, భద్రతా సిబ్బంది స్టాండ్స్‌లోకి ప్రవేశించి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని గుర్తించారు. వారందరినీ భద్రతా సిబ్బంది స్టేడియం నుంచి బయటకు పంపించారు.
టెస్టులో భాగంగా మూడోరోజైన శనివారం కూడా ప్రేక్షకులు సిరాజ్, బుమ్రాపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. దాంతో బీసీసీఐ శనివారమే క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. తాజాగా జరిగిన వివాదంతో క్రికెట్ ఆస్ట్రేలియా టీంఇండియాకు క్షమాపణలు చెప్పింది.
For More News..