సూర్యాపేటలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తాం : రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

సూర్యాపేటలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తాం :  రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు పక్కా భవన నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత మున్సిపాలిటీ భవనంలో సూర్యాపేట ప్రెస్‌క్లబ్ కార్యాలయానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రావు అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, వేణారెడ్డి మాట్లాడుతూ..  సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసేది జర్నలిస్టులేనని కొనియాడారు. 

గతంలో రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.  ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పది సంవత్సరాల క్రితమే స్థలం కేటాయించామన్నారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, చకిలం రాజేశ్వరరావు, అంజద్ అలీ, కెక్కిరేని శ్రీనివాస్, పూర్వ విద్యార్థుల మిత్ర మండలి అధ్యక్షులు నల్లగుంట్ల అయోధ్య, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు సుంకరబోయిన వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.