స్కూటీ లక్ష.. బండి నెంబర్ కు కోటి రూపాయలు

స్కూటీ  లక్ష.. బండి నెంబర్ కు కోటి రూపాయలు

సిమ్లా : ఫ్యాన్సీ నెంబర్ అంటే చాలా మంది జనాలకు క్రేజ్ ఉంటుంది. ఫోన్ నెంబర్ గానీ, వెహికిల్స్ నెంబర్ గానీ ఫ్యాన్సీగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కొందరు తాము నడిపే బండ్లకు కోరుకున్న నెంబర్ కోసం ఎంత మొత్తం చెల్లించైనా దక్కించుకునేందుకు వెనకాడరు. ఇదే కోవలోకి వస్తాడు సిమ్లాకు చెందిన ఓ వ్యక్తి. హిమాచల్ ప్రదేశ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ హెచ్పీ 999999  నెంబర్ ను వేలానికి పెట్టగా దాన్ని సొంతం చేసుకునేందుకు సదరు వ్యక్తి కోటి రూపాయలు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. ఆ నెంబర్ కోసం మొత్తం 26 మంది బిడ్ దాఖలు చేయగా.. కోట్ఖాయ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఏకంగా రూ.1,00,11,000లు కోట్ చేశాడు. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతున్నాడంటే అది ఏ లగ్జరీ కారు కోసమో అనుకుంటే పొరపాటే. సదరు వ్యక్తి దాన్ని సదరు వ్యక్తి దాన్ని రూ. లక్ష పెట్టి కొన్న స్కూటీ కోసం కొనుగోలు చేయాలనుకుంటున్నాడ. స్కూటీ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఇంత మొత్తం బిడ్డింగ్ వేయడాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. శుక్రవారం సాయంత్రం బిడ్ గడువు ముగియనుండగా.. హెచ్పీ 999999 ఫ్యాన్సీ నెంబర్ ఆయనకే దక్కే ఛాన్సుంది.