గ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా ప్రకటించాలి

గ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా ప్రకటించాలి

కంది, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరిని వీడాలని, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెండింగ్​లో ఉన్న అలవెన్సులు ఇవ్వాలని, గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సంగారెడ్డిలో ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్ఆర్ బీఈఏ  సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రకాశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో ట్రెజరర్ శామ్యూల్, ఏపీజీవీబీ ఆఫీస్ అసిస్టెంట్ , వర్కింగ్ ప్రెసిడెంట్ అశ్విన్,  రీజనల్ సెక్రటరీ రామకృష్ణ, ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ రవికుమార్, రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషనల్ రీజినల్ సెక్రెటరీ పద్మభూషణ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.