
కూకట్‌పల్లిలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీ కొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ప్రకాష్ అనే యువకుడిని కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ నంబర్ A 836 వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ప్రకాశ్ తలకు తీవ్ర గాయలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.