మెదక్ జిల్లా నారాయణపూర్‎లో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

మెదక్ జిల్లా నారాయణపూర్‎లో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

నర్సాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ లింగం తెలిపిన ప్రకారం.. నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు, విష్ణు మట్టి తరలించడానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్లారు. ట్రాక్టర్ ఓనర్ కొడుకు పిచ్చకుంట్ల వినయ్(15), రాజు, విష్ణును ఎక్కించుకొని ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ స్థానిక చెరువు కట్ట ఎక్కుతుండగా అదుపుతప్పి ట్రాలీ బోల్తా పడింది. వినయ్ ట్రాలీ కింద పడడంతో స్పాట్‎లో మృతి చెందాడు.  తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.