హైదరాబాద్లో రోజుకు వంద FIRలు.. ఇందులో 20 సైబర్ క్రైమ్ కేసులే

హైదరాబాద్లో రోజుకు వంద FIRలు.. ఇందులో 20 సైబర్ క్రైమ్ కేసులే
  • హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ లో రోజుకి వంద FIRలు నమోదు అవుతుంటే.. అందులో 20 సైబర్ క్రైమ్ కేసులే ఉంటున్నాయన్నారు సీపీ ఆనంద్. ప్రతి పోలీసు స్టేషన్లో సైబర్ క్రైమ్ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 
 

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అకౌంట్ హ్యాక్ చేసి 53లక్షలు చోరీ..నిందితుడి అరెస్ట్
హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి బ్యాంకు అకౌంట్ ను హ్యాక్ చేసి 53 లక్షల రూపాయలను కాజేసిన నిందితుడు దినేష్ ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నామన్నారు.  ఇవాళ అరెస్టు చేసిన సందర్భంగా సీపీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ జరిగిన తీరును వివరించారు. నిందితుడి వద్ద నుంచి 17లక్షలు రికవరీ చేయడంతోపాటు.. అతడి వద్ద బ్యాంకుల్లో ఉన్న 14లక్షలు ఫ్రీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 
నిందితుడి వద్ద  33 క్రెడిట్, డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విజయవాద వద్ద మైలవరంలో ఇంజనీరింగ్ చదివిన నిందితుడు దినేష్ ఎలాంటి ఉద్యోగాలు దొరక్క సైబర్ నేరాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని చెప్పారు. గత మూడేళ్లుగా హ్యాకింగ్ చేసి సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా మళ్లించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సీపీ ఆనంద్ తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి

మద్యం మత్తులో బూతులు తిడుతూ.. సెక్రటరీని కొట్టిన టీఆర్ఎస్ లీడర్

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

మీ ఇంటికే బీపీ, షుగర్ గోలీలు