
టేక్మాల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్‌పల్లి వద్ద పోలీసులు వాహన తనిఖీ చేయగా జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కొడుకు అభినవ్ పాటిల్ కారులో లక్ష రూపాయలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు టేక్మాల్ ఎస్ఐ మురళీ తెలిపారు.