
ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. ఇది చాలదన్నట్లు అక్రమ సంపాదన కోసం టేబుల్ కింద చెయ్యి పెట్టే అధికారులు అక్కడో ఇక్కడో బయటపడుతూనే ఉన్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి సస్పెండ్ చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. బుధవారం (మే 28) లంచాలకు మరిగిన ఆర్ ఐ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజవర్గం లోయర్ ట్యాంక్ బండ్ లోని ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్ ఐ ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేయడం కోసం 25 వేల రూపాయల లంచం తీసుకుంటున్న స్పెషల్ ఆర్ ఐ మహేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్టిఫికెట్ జారీ చేసేందుకు మొత్తం -రూ. 1 లక్ష 10 వేలు లంచం డిమాండ్ చేయగా.. 25 వేలు ముందుగా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా వేసి రూ.25 వేలు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
క్యాంటీన్లో నెల జీతంపైన పనిచేసే జి రామకృష్ణ అనే వ్యక్తి ఫ్యామిలీ సర్టిఫికెట్స్ కోసం అప్లై చేసి ముషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఆర్ ఐ మహేష్ ను కలిశారు. దీనితో సదరు ఆర్ ఐ తనకు లక్షా 10 వేలు వేలు ఇస్తేనే సర్టిఫికెట్ వస్తుందని చెప్పాడు. దీంతో కంప్లైంట్ దారుడు ఏమి చేయలేక డిమాండ్ చేసిన మేరకు ఒప్పుకుని ముందుగా రూ.25 వేలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బుధవారం (మే 28) ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆర్రఐ మహేషన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
►ALSO READ | మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా:ఇప్పటికే ఐదుగురు చనిపోయారు
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘క్యాంటీన్ లో పని చేసే వ్యక్తి బంధువులు చనిపోయారు. వారు బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు డబ్బులు కట్టగా.. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంటేనే ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో వాళ్లకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇప్పించేందుకు ఆన్ లైన్ లో అప్లై చేసుకున్నారు. అయితే సంబంధిత సెక్షన్ ఆర్ ఐ.. అప్లికేషన్ ఫామ్స్ తీసుకుని.. సర్టిఫికెట్ కోర్టు నుంచి రావాలంటే ఆలస్యం అవుతుందని.. తాను తొందరగా సర్టిఫికెట్ వచ్చేలా చేస్తానని చెప్పాడు. అందుకోసం లక్షా 20 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. తను క్యాంటీన్ నడిపే వ్యక్తినని, నెలకు పది వేలు సంపాదించే తాను అంత డబ్బు చెల్లించుకోలేనని చెప్పడంతో లక్ష రూపాయలకు తగ్గించాడు ఆర్ఐ. దీంతో ఆ కంప్లైంట్ దారుడు మమ్మల్ని సంప్రదించడంతో.. నిఘా ఉంచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం’’ అని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
రెవెన్యూ ఖన్ స్పెక్టర్ (ఆర్ఐ) ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఎమ్యార్వో కార్యాలయంతో పాటు మహేశ్ నివాసంలో సోదాలు చేశారు అధికారులు. ఆర్ఐ మహేశ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.