కొత్త ఏడాదిలో కొత్త జాబ్‌లు!

కొత్త ఏడాదిలో కొత్త జాబ్‌లు!

న్యూఢిల్లీ: ఐటీ  కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేయడంతో ఈ ఏడాది జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆందోళనలు పెరిగినప్పటీకీ, కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగాలు  క్రియేట్ అవుతాయని రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటి అంచనావేసింది. 5జీ వలన టెలికం సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, దేశ  ఎకానమీ బాగుండడంతో  సర్వీసెస్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నియామకాలు పుంజుకుంటాయని టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్  సర్వీసెస్ రిపోర్ట్ పేర్కొంది. స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకోవడం, కొత్త స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నేర్చుకోవడం వంటి ట్రెండ్స్ ఈ ఏడాది పుట్టుకొచ్చాయని, వచ్చే ఏడాది కూడా ఈ ట్రెండ్స్ కొనసాగుతాయని తెలిపింది.  టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగుల తొలగింపు భారీగా ఉండకపోవచ్చన్న టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను ఈ ఏడాదే కంపెనీలు తీసుకున్నాయని అభిప్రాయపడింది. ఇక కంపెనీల ఫోకస్ అంతా స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న ఉద్యోగులను నియమించుకోవడంపై ఉంటుందని, స్లో గానైనా కీలకమైన స్కిల్స్ ఉన్నవారిని కంపెనీలు ఎంచుకుంటాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. వీరికి భారీగా  జీతాలిచ్చేందుకు ముందుకొస్తాయని  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ఇండియా సీఈఓ అచల్ ఖన్నా అన్నారు. 

ఐటీలో స్లోనే...

ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మైక్రోసాఫ్ట్, స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్ వంటి  పెద్ద టెక్ కంపెనీలు ఈ ఏడాది  ఉద్యోగులను భారీగా తీసేశాయి. దీంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైరింగ్ యాక్టివిటీ స్లో అయ్యింది. దేశంలోని టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  ఈ ఏడాది 20 వేల మంది ఉద్యోగులను తీసేశాయని అంచనా. వచ్చే ఏడాది కూడా ఐటీ, టెక్ సెక్టార్లలో హైరింగ్ యాక్టివిటీ పెద్దగా ఉండకపోవచ్చని టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్ రిపోర్ట్ పేర్కొంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో  ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తగ్గుతున్నాయని, ఫలితంగా ఈ కంపెనీలు  బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్నవారితో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నడిపిస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నియామకాలు పరిమితంగా ఉంటాయని చెప్పారు. ఉద్యోగుల స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడంపై కంపెనీలు ఫోకస్ పెడతాయని అన్నారు. ‘పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపు, నియామకాలు ఆగిపోవడం, రెసిషన్ భయాలు..గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నెగెటివ్ ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ దేశంలో మాత్రం సెంటిమెంట్ బలంగా ఉంది. 77 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించాయి’ అని టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టడే అన్నారు. ప్రభుత్వం ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ సంస్కరణలు తీసుకురావడం, శాటిలైట్ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లిబరలైజ్ చేయడం, రిమోట్ సెన్సింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రోత్సహించడంతో  ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని పేర్కొన్నారు.  

టెలికం కంపెనీలు 5 జీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి తెచ్చాయి. ‘5జీ అందుబాటులోకి రావడం వలన  కంపెనీలు తమ ఉద్యోగుల స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుస్తున్నాయి. దీంతో ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్రియేట్ అవుతాయి’ అని టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వివరించారు.  చైనా ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూరప్ ప్లస్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రాటజీతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను ఇండియా ఆకర్షించగలదని, ఫలితంగా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం సీఈఓ అచల్ ఖన్నా పేర్కొన్నారు. ఈ ఏడాది దేశ జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతిపెద్ద మార్పు వచ్చిందని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ సచిన్ అలుగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను కంపెనీలు అర్థం చేసుకుంటున్నాయని, వర్చువల్ స్కిల్స్ పెంచడం ద్వారా తమ ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ మెరుగుపడడాన్ని వీరు గుర్తిస్తున్నారని వివరించారు.