ఇండియాకు కోపం బాగా పెరుగుతుంది.. ప్రతి 10 మందిలో ముగ్గురికి హైబీపీ

ఇండియాకు కోపం బాగా పెరుగుతుంది.. ప్రతి 10 మందిలో ముగ్గురికి హైబీపీ

ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బాధితులు పెరిగిపోతున్నారని.. అధిక రక్తపోటు (హైబీపీ) నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధిక రక్తపోటు( హైబీపీ)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించింది. 

ఇటీవల WHO  విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు (హైబీపీ) ఉందని.. ప్రతి ఐదుగురిలో నలుగురికి రక్తపోటుకు తగిన చికిత్స అందడంలేదని ప్రకటించింది.  ప్రపంచ దేశాలు అధిక రక్తపోటుపై ప్రత్యేక అవగాహన కల్పిస్తే.. 2023 నుంచి 2050 లోపు సుమారు 7.6 మిలియన్ల మరణాలను నియంత్రించవచ్చని  WHO తెలిపింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. దేశ జనాభాలో39 శాతం మంది భారతీయులు హైబీపీతో బాధపడుతున్నారు. 30-నుంచి 79 సంవత్సరాల వయస్సు గల 188.3 మిలియన్ల మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు అంచనా వేసింది. వీరిలో 32 శాతం మంది పురుషులు, 42 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అధిక రక్తపోటును నియంత్రిస్తే భారతదేశంలో 4.6 మిలియన్ల మరణాలను నివారించవచ్చని వెల్లడించింది.  వీరిలో కేవలం 35 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం 15 శాతం మంది మాత్రమే బీపీ కంట్రోల్ తో ఉన్నారని WHO  తెలిపింది. 

అనియంత్రిత రక్తపోటు (హైబీపీ) గుండెపోటు, స్ర్టోక్స్, అకాల మరణాలకు దారితీస్తుందని.. భారత్ లో గుండె సంబంధిత వ్యాధులతో సంభవించే మరణాల్లో 52 శాతం మరణాలు అధిక రక్తపోటు వల్లే అని WHO నివేదికలు చెబుతున్నాయి. 

అధిక రక్తపోటు( హైబీపీ) ని చికిత్స చేయకుండా వదిలేస్టే గుండపోటు, స్ట్రోక్స్, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని.. భారతీయుల్లో ప్రతి పదిమందిలో ముగ్గురు హైబీపీతో బాధపడుతున్నారని WHO అంచనా వేసింది.మందులు, జీవన శైలీలో మార్పుల ద్వారా హైబీపీని నియంత్రించవచ్చని.. అయితే వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. 

భారతదేశంలో రక్తపోటు -సంబంధిత మరణాలను త గ్గించడానికి అవగాహన, క్రమంగా తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలని ప్రజలను ప్రోత్సహించడం చాలా అవసరని WHO స్పష్టం చేస్తోంది. హైబీపీతో బాధపడేవారు పొగ తాగడం మానేయడం, ఉప్పు తీసుకోవడం తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అవసరమైన జీవన శైలీలో మార్పులు చేసుకోవడం చాలా అవసరమని WHO తెలిపింది.