కొనసాగుతున్న బంద్

కొనసాగుతున్న బంద్

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల భారత్ బంద్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్, SP, BSP, ఆప్, TMC, వామపక్షాలు, DMK, ఆర్జేడీ, NCP, TRS సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు భారత్ బంద్ కు పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ మద్దతు తెలిపింది. బంద్ కు మద్దతిస్తూనే… కార్మికులు విదుల్లో పాల్గొంటారని పేర్కొంది.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేపట్టే బంద్ లో భాగంగా నేషనల్ హైవేలను బ్లాక్ చేయనున్నారు. టోల్ ప్లాజాలను ముట్టడించనున్నారు. కార్మిక సంఘాలు…నల్ల రిబ్బన్ కట్టుకొని రైతులకు మద్దతుగా నిరసన తెలపనున్నాయి. బంద్ కు మద్దతుగా ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ అన్ని సర్వీసులను రద్దు చేసింది.

భారత్ బంద్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే నిరసనలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ బంద్ కు మద్దతు తెలపటంతో… జిల్లాల్లోని పార్టీ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భారత్ బంద్ లో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి వామపక్షాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆర్టీసీ డిపో ముందు కాంగ్రెస్, సీపీఐ నాయకులు ధర్నా చేశారు. డిపో నుంచి బస్ లు బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్యకర్తలు.  ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 950 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అటు జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఆర్టీసీ డిపో ముందు టిఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.