ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
  • ఇవాళ కూడా 11 వేల 698 కొత్త కేసులు.. 37 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ శనివారం కూడా 11 వేల 698 కేసులు నమోదయ్యాయి. కట్టడి కోసం రాత్రిపూట కర్ఫ్యూతోపాటు.. ఇతర ఆంక్షలు విధిస్తున్నా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 50 వేల 972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11 వేల 698 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 37 మంది కరోనా నుంచి కోలేకోలేక కన్నుమూశారు. తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, శ్రీకాకుళం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, విశాఖపట్టణం, గుంటూరు,కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, ప్రకాశం జిల్లాలో ఒకరు కరోనా చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 4 వేల 421 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ఇవాళ్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 59 లక్షల 31 వేల 722 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.